నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి?

నో కాస్ట్ ఈఎంఐ అని వినగానే మనకు ముందుగా రుణంపై ఎలాంటి వడ్డీని చెల్లించనవసరం లేదని అనిపిస్తుంది

నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి?

మీరు కొత్త మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? కానీ మీ దగ్గర కేవలం రూ. 15000 మాత్రమే ఉన్నాయా? ఈ కామర్స్ దిగ్గజాలయిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వారి వినియోగదారులకు నో కాస్ట్ ఈఎంఐ అనే ఆఫర్ ను అందిస్తున్నాయి. ఈ ఆఫర్ ప్రకారం వినియోగదారులు వారి క్రెడిట్ కార్డు ద్వారా రూ. 30000 విలువ చేసే మొబైల్ ఫోన్ ను నెలకు రూ. 10000 చొప్పున మూడు నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వారు రూ. 638 డిస్కౌంట్ ను కూడా అందిస్తారు. దీంతో మీరు మొబైల్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేనా? వాస్తవానికి ఇక్కడ జరిగేదేంటో కింద చూద్దాం.

2013 సంవత్సరంలో, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రిటైల్ ఉత్పత్తులపై బ్యాంకులు అందించే సున్నా శాతం ఈఎంఐ పథకాన్ని నిషేధించింది. అందువలన బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ అనే పేరుతో మళ్ళీ మార్కెట్ లోకి ప్రవేశించాయి. నో కాస్ట్ ఈఎంఐ అని వినగానే మనకు ముందుగా రుణంపై ఎలాంటి వడ్డీని చెల్లించనవసరం లేదని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అలా ఉండదు. మీ బ్యాంకు వడ్డీ రూపంలో దానిపై వచ్చే తగ్గింపును తిరిగి తీసుకుంటుంది. "ఆర్బీఐ వడ్డీ రహిత రుణాలను అనుమతించదు. వెండర్లు లేదా కంపెనీలు ముందుగానే వడ్డీ మొత్తానికి సమానమైన డిస్కౌంట్ లేదా కాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తాయని పైసాదుకాణ్.కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ ఎం. రంజన్ తెలిపారు.

పైన తెలిపిన ఉదాహరణలో, ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్ ను తీసుకుంటే, రూ. 638 వడ్డీని చెల్లించాలి. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీకు ఇదే మొత్తం తగ్గింపు రూపంలో లభిస్తుంది. అప్పుడు ఆ మొబైల్ మీకు రూ. 29,362 లకే లభిస్తుంది, కానీ మీ మొత్తం ఈఎంఐతో కలిపి మొబైల్ రూ. 30,000 గా ఉంటుంది. ఇది కాక మీరు బ్యాంకుకి అదనంగా పన్నులు కూడా చెల్లించవలసి ఉంటుంది.

నో కాస్ట్ ఈఎంఐ ఎలా పనిచేస్తుంది?

నో కాస్ట్ ఈఎంఐలో ముగ్గురు వాటాదారులు ఉన్నారు. వారిలో రిటైలర్, బ్యాంక్, వినియోగదారుడు. సాధారణంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను అందిస్తాయి. నో కాస్ట్ ఈఎంఐ ను అందించే బ్యాంకు క్రెడిట్ కార్డు మీదగ్గర లేకపోతే, మీరు ఈ ఆఫర్ ను పొందలేరు. అప్పుడు మీరు ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి ఈఎంఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అదే బజాజ్ ఫిన్సర్వ్. మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు కోసం కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రిటైలర్స్ వేగంగా అమ్ముకోవాలనుకుంటున్న ఉత్పత్తులపై మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను అందిస్తాయి. నో కాస్ట్ ఈఎంఐ విషయంలో, కస్టమర్ చెల్లించే వడ్డీకి సమానమైన తగ్గింపును ఇవ్వడానికి రిటైలర్ సుముఖంగా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ లేదా అసలు పరికరాలు తయారీదారు కస్టమర్ కు రాయితీ వడ్డీని చెల్లిస్తారని రంజన్ అన్నారు.

మీరు నో కాస్ట్ ఈఎంఐని ఎంచుకోవాలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆర్బీఎల్ బ్యాంకు లిమిటెడ్, యస్ బ్యాంక్ లిమిటెడ్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ - కామర్స్ వెబ్ సైట్ లలో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను అందిస్తాయి. సాధారణంగా, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్స్, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తులపై డిస్కౌంట్ ఉంటుంది. రిటైలర్లు ప్రత్యక్ష తగ్గింపును అందించాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అది ఉత్పత్తి రాయితీని తగ్గిస్తుంది.

కొన్నిసార్లు డిస్కౌంట్ కంటే ఈఎమ్ఐ త‌క్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంది. ఇది మార్కెటింగ్ జిమ్మిక్. అలాగే కొత్త స్టాక్ కు బదులుగా పాత స్టాక్ ను తగ్గించుకోవడానికి ఇది సరైన మార్గం. గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి రుణాన్నీ ఎంచుకోవడం మంచిది కాదు. మీరు కొనుగోలు చేయాలనుకునే వస్తువు తగ్గింపుతో లభ్యమవుతునప్పుడు అది మీ కోసం పని చేస్తుంది. అయితే, మీరు మార్కెటింగ్ జిమ్మిక్ లో చిక్కుకోకండి, ఇక్కడ మీరు అవసరం లేని ఉత్పత్తిని కొనడంతో పాటు, అధిక ధరకు కొనాల్సి వస్తుంది. అలాగే, ఈఎంఐతో కొనుగోలు చేయకపోవడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly