ఇన్సూర్డ్ డిక్లేర్ వేల్యూకి వాహన బీమాకి సంబంధం ఏంటి?

కారు బీమా పాల‌సీ తీసుకునే వారు ఐడీవీ గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది

ఇన్సూర్డ్ డిక్లేర్ వేల్యూకి వాహన బీమాకి సంబంధం ఏంటి?

మీరు సరైన కారు బీమాను కలిగి ఉండకపోతే భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు, బ్రేక్ డౌన్, మరమత్తులు మీకు పెద్ద మొత్తంలో ఆర్థిక ఇబ్బందులను మిగులుస్తాయి. దీని నుంచి మీరు బయటపడాలంటే కచ్చితంగా మంచి ప్రీమియంతో సమగ్రమైన కారు బీమాను తీసుకోవడం మంచిది. దానికి తగినన్నీ రైడర్లను జోడిస్తే మరింత మంచిది. అయితే కారు బీమా పాల‌సీ తీసుకునే వారు ఐడీవీ గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. సాధారణంగా చెప్పాలంటే, ఐడీవీ అనేది ప్రస్తుత మీ వాహన మార్కెట్ విలువ. బీమా సంస్థ వాహన ఇన్సూరెన్సు పాలసీకి చెల్లించే అత్యధిక మొత్తాన్ని ఐడీవీ అంటారు. ఒకవేళ పాలసీ సమయంలో మీ వాహనానికి పూర్తి నష్టం వాటిల్లినా, చోరీకి గురైనా, మరమ్మత్తుల వ్యయం పాలసీలో పేర్కొన్న సొమ్ము కంటే ఎక్కువ ఆయినా సరే మీరు పాలసీలో పేర్కొన్న మొత్తాన్నే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఆర్డీఏఐ నిబంధ‌న‌ల‌ ప్రకారం, మీ వాహనానికి గరిష్టంగా ప్రకటించిన విలువ దాని ఎక్స్-షోరూమ్ ధరలో 95 శాతంగా ఉండాలి. వాహనం కొనుగోలు చేసిన ఆరు నెలల తరువాత, దాని విలువ 5 శాతం తగ్గిపోతుంది. వాహన తరుగుదల దాని కొనుగోలు చేసిన సంవ‌త్స‌రం ఆధారంగా ఉంటుంది. వాహ‌నాన్ని వినియోగించే కాలం పెరిగితే ఐడీవీ తగ్గుతూ పోతుంది. వాహన బీమా అనేది ఐడీవీని బట్టి మారుతూ ఉంటుంది. త‌ద్వారా బీమా పాల‌సీ పై చెల్లించే ప్రీమియం తగ్గుతూ ఉంటుంది.

వాహ‌నాన్ని వినియోగించే కాలం పెరిగే కొద్దీ దాని తరుగుదల ఎలా ఉంటుందో కింద పట్టికలో చూడండి.

tabcar.png

ఆరో సంవత్సరం నుంచి అప్ప‌టి కారు విలువ‌లో 10-15 వ‌ర‌కూ త‌రుగుద‌ల ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly