ఫండ్ల‌ను ఉప‌సంహ‌రించే ముందు ఆలోచిస్తున్నారా?

పెట్టుబ‌డి పెట్ట‌డం ఎంత ముఖ్య‌మో దానిని ఉప‌సంహ‌రించ‌డం అంత‌కంటే ముఖ్య‌మని మ‌దుప‌ర్లు గ‌మ‌నించాలి.

ఫండ్ల‌ను ఉప‌సంహ‌రించే ముందు ఆలోచిస్తున్నారా?

త‌మ ఆర్థిక ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకోవాల‌నే విష‌యం మ‌దుప‌ర్లు త‌మ అవ‌స‌రాల‌కు ఏ పెట్టుబ‌డులను ఉప‌సంహ‌రించాల‌నేవిష‌యంలో స్ప‌ష్టత ఉంటుంది. పెరుగుతున్న మ‌దుప‌ర్లు…త‌గ్గుతున్న కాల‌ప‌రిమితి…ఒక వైపు మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌ట్ల‌ అవ‌గాహ‌న పెరిగి మ‌దుపు చేసే వారు పెరుగుతుంటే, మ‌రో ప‌క్క క‌నీసం ఏడాది పాటు కూడా పెట్టుబ‌డి కొన‌సాగించ‌ని వారి శాతం కూడా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. యాంఫీ ఇటీవ‌లె విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం 51శాతం పెట్టుబ‌డులు ఒక సంవ‌త్స‌రం లోపులోనే ఉప‌సంహ‌రిస్తున్నారు. కేవ‌లం 29 శాతం పెట్టుబ‌డుల‌ను మాత్ర‌మే రెండేళ్ల‌కు మించి కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తీ మ్యూచువ‌ల్ ఫండ్ ఒక థీమ్ ఆధారంగా ప‌నిచేస్తుంది. వివిధ ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలు ఈక్విటీ, బాండ్లు, బంగారంలో పెట్టుబ‌డులు చేస్తుంటాయి. ఆయా ఫండ్లు వాటి విశిష్ట‌త‌ల‌ను బ‌ట్టి మ‌దుప‌ర్లకు ఫండ్ల‌లో క‌నీసం ఎంత కాలం మ‌దుపు కొన‌సాగిస్తే మంచిది అనే విష‌యం పై అవ‌గాహ‌న ఉండాలి.

ప‌న్ను వ‌ర్తించే విధానం:

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఉప‌సంహ‌రించే ముందు మీరు పొందిన మూల‌ధ‌న ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈక్విటీ లేదా డెట్ ఏ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టినా దీర్ఘ‌కాలిక లేదా స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డైనా వాటికి అనుగుణంగా ప‌న్ను చెల్లించాలి.

డెట్ (స్థిరాదాయ) ఫండ్ల‌లో:

డెట్ (స్థిరాదాయ)మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మూడేళ్లు పైబ‌డి వ‌చ్చిన రాబ‌డిని దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంగా గుర్తిస్తారు. ప‌న్నువ్య‌క్తిగ‌త శ్లాబు రేటు వ‌ద్ద ఉంటుంది. మూడేళ్ల కంటే త‌క్కువ కాలం ఉంచే పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయాన్ని స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న ఆదాయంగా గుర్తిస్తారు. ఇండెక్షేష‌న్ తో 20.6 శాతం ప‌న్ను ఉంటుంది.

ఈక్విటీ ఫండ్ల‌లో:

ఏడాది కంటే త‌క్కువ కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న ఆదాయంంగా ప‌రిగ‌ణిస్తారు. 15.45 శాతం ప‌న్ను చెల్లించాలి. ఏడాడి పైబ‌డి కొన‌సాగించిన పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిని దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. ఏప్రిల్ 1 నుంచి తీసుకువ‌చ్చిన నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంపై రాబ‌డి రూ. 1 ల‌క్ష దాటితే ప‌న్ను 10.3 చెల్లించాలి. ఏప్రిల్ 1, 2018 కంటే ముందుగా పెట్టిన పెట్టుబ‌డుల‌పై ఇది వ‌ర్తించ‌దు. సిప్ విధానంలో చేసిన వారికి ఆ తేదీ ప్ర‌కారం కాలాన్ని లెక్కించి ప‌న్ను చెల్లించాలి.

ఫండ్ ప‌నితీరు:

మ‌దుప‌ర్లు తాము పెట్టుబ‌డి చేసే మ్యూచువ‌ల్ ఫండ్ ప‌నితీరు స‌రిగా లేన‌పుడు, ఇత‌ర ఫండ్ల‌తో, బెంచ్ మార్క్ సూచీ కంటే త‌క్కువ రాబ‌డి అందించిన‌పుడు ఆ ఫండ్ లో పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించ‌డం లేదా వేరొక ఫండ్ లోకి స్విచ్ ఓవ‌ర్ పెట్టుకోవ‌డం మంచిది. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డులు కొన‌సాగించినా ఫ‌లితం ఉండ‌ద‌నిపిస్తే పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించ‌డం లేదా మార్చుకోవ‌డం చేయాలి. ఫండ్ నుంచి పెట్టుబ‌డుల‌ను స్విచ్ ఓవ‌ర్ చేసేముందు లేదా ఉప‌సంహ‌రించే ముందు నిర్ణ‌యం చాలా జాగ్ర‌త్త‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కూ ఫండ్ ప‌నితీరు బాలేద‌ని వేరొక ఫండ్లో పెడితే అది కూడా అనుకున్న‌విధంగా లేక‌పోతే ఫ‌లితం ఉండ‌దు. కాబ‌ట్టి ఫండ్ ప‌క్కాగా గ‌త కొంత కాలంగా ప‌నితీరు బాలేద‌ని అనిపిస్తే మాత్ర‌మే పెట్టుబ‌డిని మార్చాలి.

సిస్ట‌మేటిక్ విత్‌డ్రా చేయాలి:

మ్యూచువ‌ల్ పెట్టుబ‌డులు మొత్తాన్ని ఒకే సారి ఉప‌సంహ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయిల్ ప్లాన్ ద్వారా నెల‌నెలా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక కోసం పొదుపు చేసిన ఫండ్ నుంచి డ‌బ్బును ప్ర‌తీ నెలా స్థిర‌మైన మొత్తాన్ని ఉప‌సంహర‌ణ చేసుకోవ‌చ్చు. దీంతో మీరు తీయ‌గా మిగిలిన మొత్తం ఆ ఫండ్‌లో పెట్టుబ‌డిగా కొన‌సాగుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly