మ‌దుప‌ర్లు ఇప్పుడు ఏం చేయాలి?

సిప్ కేవలం పెట్టుబడి చేసే విధానం. దీని కంటే ఫండ్ ఎంపిక మ‌రింత ముఖ్య‌మైంది. నిరంతరంగా బెంచ్మార్క్ ను అధిగ‌మించి రాబ‌డిని అందించే ఫండ్ల‌ను ఎంచుకోవాలి.

మ‌దుప‌ర్లు ఇప్పుడు ఏం చేయాలి?

కేంద్రంలో సుస్థిర‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టంతో మార్కెట్లు గ‌రిష్ట స్థాయిల‌ను తాకాయి. దీర్థ‌కాలంపాటు మార్కెట్ల‌లో కొన‌సాగి లాభాల‌ను పొందాల‌నుకునే వారికి ఈక్విటీ మార్కెట్లు అనుకూలంగా ఉంటాయి. కొత్త‌గా పెట్టుబ‌డి ప్రారంభించాల‌నుకునే వారు, ఇప్ప‌టికే ఉన్న మ‌దుప‌ర్లు దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని విష‌యాలు చూద్దాం.

ల‌క్ష్యానికి అనుగుణంగా: పెట్టుబ‌డి చేసే ముందు మ‌దుప‌ర్లు త‌మ ల‌క్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక ల‌క్ష్యాన్ని పెట్టుబ‌డితో లింక్ చేసుకోవాలి. ద్ర‌వ్యోల్బ‌ణం అంచ‌నాతో కూడిన రాబ‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ల‌క్ష్యానికి ఎంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుందో లెక్కించి దానికి అనుగుణంగా నెల‌వారీ పెట్టుబ‌డి మొత్తం నిర్ణ‌యించాలి. దీనికి సిప్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్లు మంచి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

సిప్ ఎందుకు: క్ర‌మ‌మైన ఆదాయం క‌లిగిన వారు సిప్ విధానంలో మ‌దుపు చేయ‌డం ద్వారా మంచి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. మార్కెట్ల‌లో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డినా ఆ ప్ర‌భావం సిప్ విధానం ద్వారా స‌ర్దుబాటు అవుతుంది. క్ర‌మంగా మ‌దుపు చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్లు మార్కెట్లో మ‌దుపుచేసేందుకు వేచిచూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అదే ఒకేసారి ఎక్కువ మొత్తం పెట్టుబ‌డి చేయాలంటే మార్కెట్ టైమింగ్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

ఎందులో సిప్ చేయాలి: సిప్ కేవలం పెట్టుబడి చేసే విధానం. దీని కంటే ఫండ్ ఎంపిక మ‌రింత ముఖ్య‌మైంది. నిరంతరంగా బెంచ్మార్క్ ను అధిగ‌మించి రాబ‌డిని అందించే ఫండ్ల‌ను ఎంచుకోవాలి. దీర్ఘ‌కాలంలో స్థిరంగా రాబ‌డిని అందిస్తున్న ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవాలి. ఫండ్ స్వల్పకాలిక పనితీరును బ‌ట్టి మాత్ర‌మే నిర్ణయించుకోవద్దు. మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఏర్పాటుకు క‌నీసం 2-3 స్కీమ్లను ఎంచుకోవాలి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం, పెట్టుబ‌డి చేసే కాలం ఆధారంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లను జోడించుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసే ముందు ఫండ్ లక్ష్యం , పెట్టుబ‌డి విధానాన్ని అర్థం చేసుకునేంద‌కు, ఫఃడ్ ఫ్యాక్ట్ షీట్ ని ప‌రిశీలించాలి. పోర్ట్ఫోలియో నిర్మాణం, మార్కెట్ కాప్ ప్రకారం, టాప్ 5 పరిశ్రమలు ,టాప్ 5 స్టాక్ల‌ కేటాయింపు మొద‌లైన విష‌యాల గురించి తెలుసుకోవ‌చ్చు.

యాక్టివ్ లేదా ప్యాసివ్: ఫండ్ మేనేజ‌ర్ల‌చే క్రియాశీల‌కంగా నిర్వ‌హించే యాక్టివ్ ఫండ్లు, ఇండెక్స్ ను అన‌క‌రించి పెట్టుబ‌డి చేసే ప్యాసివ్ రెండు ర‌కాల ఫండ్లు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. టాప్ 25 ఈక్విటీ ఫండ్ల‌ను తీసుకుంటే నిఫ్టీ బెంచ్ మార్క్ కంటే క‌నీసం 2 శాతం అధిక రాబ‌డి అందించిన‌ట్లు తెలుస్తోంది. ఇండెక్స్ ఫండ్లలో రాబ‌డి దాదాపు ఇండెక్స్ అందించిన రాబ‌డికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అయితే అన్ని యాక్టివ్ ఫండ్లు బెంచ్ మార్క్ ను మించి రాబ‌డి అందించ‌డం లేదు. కాబ‌ట్టి ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో మ‌దుప‌ర్లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

రెగ్యుల‌ర్ లేదా డైరెక్ట్: రెగ్యుల‌ర్ ప్లాన్ లో మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల నుంచి స‌ల‌హాలు,సూచ‌న‌లు పొంద‌వ‌చ్చు. డైరెక్ట్ విధానంలో మ‌దుప‌ర్లు సొంతంగా నిర్ణ‌యం తీసుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారు డైరెక్ట్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. ఫండ్ ఎన్ఏవీ రెగ్యుల‌ర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్ లో కొంత ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ విధానంలో మ్యూచువ‌ల్ ఫండ్ డిస్ట్రిబ్యూట‌ర్లకు క‌మీష‌న్ ఉండ‌దు. ఏ ప్లాన్ ఎంచుకోవాలి అనే విష‌యం మ‌దుప‌ర్లు నిర్ణ‌యించుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి అనుభ‌వం లేని వారు రెగ్యుల‌ర్ ప్లాన్ ఎంచుకోవ‌డం ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థల నుంచి స‌ల‌హాలు, సూచ‌నలు పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly