క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో పెట్టుబ‌డుల‌కు ఏది మేలు?

మ్యూచువల్ ఫండ్స్ లో నిపుణులైన ఫండ్ మేనేజర్ లు మెరుగైన ఫలితాలు ఇవ్వగల కంపెనీల కోసం నిరంతరం శోధించి, వాటిలో మదుపు చేస్తారు

క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో పెట్టుబ‌డుల‌కు ఏది మేలు?

ఈక్విటీ మార్కెట్ ఇంత దిగువకు పడిపోవడం సాధారణ మదుపరులకు పెద్ద దెబ్బ . మదుపు చేసే ముందు మీ ఆర్ధిక లక్ష్యం ఏమిటి, ఎంత సమయం వుంది , మదుపు చేయగల సొమ్ము ఎంత , ఎటువంటి ఆస్తిలో చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి.
ఈక్విటీలు దీర్ఘకాలంలో అంటే 7 అంతకంటే ఎక్కువ ఏళ్ళ కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి నిరంతరంగా రాబడి అందించాయి. గత 40 ఏళ్లలో భారతదేశంలో స్టాక్ మార్కెట్ గానీ లేదా గత 100 ఏళ్ల యుఎస్ స్టాక్ మార్కెట్ లను పరిశీలించినా, అన్ని అసెట్ క్లాస్ లకన్నా అధిక రాబడిని అందించాయి . ఈక్విటీలలో మదుపు అంటే మానవ పురోగతి, ఆశయాలు, ఆకాంక్షలలో మదుపు చేయడమే . మరే ఇతర అసెట్ క్లాస్ కూడా అధిక రాబడి ఇచ్చి ఉండవు .

భారతదేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దశాబ్దాలుగా ఉన్నప్పటికీ , అసలు ఈక్విటీ షేర్లలో మదుపు చేసే రిటైల్ మ‌దుప‌రులు కూడా తక్కువ సంఖ్యలోనే వుండటం, అలాగే 2010 వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి అంతగా ప్రచారం లేకపోవడం కొన్ని కారణాలు.

స్టాక్ మార్కెట్లు జాతీయ , అంతర్జాతీయ అనేక అంశాల వల్ల రోజువారీ ట్రేడింగ్ లో వాటి ధరలలో హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అది ఒక కంపెనీకి పెరగబోయే ఆదాయం వల్లగానీ , లాభనష్టాలవల్లగానీ , ప్రభుత్వ విధానాలుగానీ, అంతర్జాతీయంగా వచ్చే మార్పులుగానీ , ఏవైనా కావచ్చు. వీటికితోడు అల్గోరిథమిక్ ట్రేడింగ్, మెషిన్ లెర్నింగ్ , వంటి అధునాతన ప్రక్రియలను అవలంభించి షేర్ ల కొనుగోలు, అమ్మకాలు చేయడం వలన ఈక్విటీ ధరలలో మరింత సంక్లిష్టత ఏర్పడుతోంది .

ఈక్విటీ షేర్ ల గురించి అనేక వెబ్ సైట్ లు అందించే కంపెనీల గురించి , షేర్ ధర గురించి సమాచారం ఉన్నప్పటికీ, షేర్ ను ఎంచుకునే విషయం లో రిటైల్ మదుపరులు ఇబ్బందికి గురవుతున్నారు. కంపెనీ గురించి వివరణాత్మకంగా తెలుసుకునే సమయం, జ్ఞానం , పరీక్షించే సమయం లేకపోవడం వంటివి కొన్ని కారణాలు .

90వ దశకంలో కొన్ని ప్రత్యేక సంచికలు సమర్పించే వ్యాసాలు, నివేదికల ఆధారంగానే కంపెనీల పనితీరు తెలిసేది . ఇప్పుడున్నంత అధునాతన టెక్నాలజీ ఆనాడు లేదు. దీర్ఘకాలం మదుపుకోసం స్టాక్ ఎంపిక : దీర్ఘకాలంలో ఈక్విటీ లు సగటున 12 శాతం వరకు వార్షిక రాబడినిచ్చాయి. స్టాక్మా ర్కెట్ సూచికలు 14 నుంచి 16 శాతం వరకు ఇచ్చాయి. అయితే రిటైల్ మదుపరులకు తాము ఎంపిక చేసిన కంపెనీ
నిబట్టి ఇంత కంటే ఎక్కువ లేదు తక్కువ ఇచ్చి ఉండొచ్చు . అయితే అటువంటి షేర్ల ఎంపిక అంత సులభం కాదు .

ఒకప్పుడు బాగా ఉన్న కంపెనీలు , కొన్ని సార్లు దివాళా తీశాయి . అయితే కొన్ని కంపెనీలు దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చాయి . మ్యూచువల్ ఫండ్స్ లో నిపుణులైన ఫండ్ మేనేజర్ లు మెరుగైన ఫలితాలు ఇవ్వగల కంపెనీల కోసం నిరంతరం శోధించి, వాటిలో మదుపు చేస్తారు. అలాగే నిర్వహణ ఖర్చులను నియంత్రణలో ఉంచుతారు. అందువలన రిటైల్ మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం సులభంగా వుంటుంది .

అదే వ్యక్తిగతంగా షేర్లను ఎంచుకుని మదుపు చేయడం రిటైల్ మదుపరులకు అంత సులభం కాదు. ప్రస్తుత కోవిడ్- 19 పరిస్థితులలో మధ్య, చిన్న తరహా కంపెనీల పరిస్థితి మరింత దిగజారుతుంది . రానున్న నెలలలోనే వీటి భవిష్యత్ తెలుస్తుంది . ఇటువంటి తరుణంలో స్టాక్ ఎంచుకోవడం చాలా కష్టతరమైన పని. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ లు ఇటువంటి విపత్కర పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తుంటారు కాబట్టి , మంచి స్టాక్స్ ఎంచుకోవడంలో వారి అనుభవం మంచి ఫలితాలనిస్తాయి .

ఇటువంటి సంక్షభ సమయంలో ఈక్విటీలలో మదుపు చేయదలచిన మదుపరులు మల్టీ బ్యాగర్ స్టాక్ లను ఎంచుకోవాలని అనుకొంటారు. ఈ గడ్డు పరిస్థితి తరువాత మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. దీనికి కొంత అనుభవం ఉండాలి . అందువలన ఈక్విటీలలో మదుపు చేయదలచిన మదుపరులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly