పోస్ట్ ఆఫీస్ పొదుపు పధకాలలో మంచిది ఏది?

పోస్ట్ ఆఫీసు పధకాలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి

పోస్ట్ ఆఫీస్ పొదుపు పధకాలలో మంచిది ఏది?

దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసులు తొమ్మిది రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి, ఇందులో ముఖ్యంగా స్థిర డిపాజిట్లు (ఎఫ్ డీ), రికరింగ్ డిపాజిట్లు (ఆర్ డీ)లు ఉన్నాయి. ఇవి రెండూ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే, ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో ఒకేసారి డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే రికరింగ్ డిపాజిట్లలో అయితే నెల నెలా డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ ఆదాయ పన్ను చట్టం ప్రకారం 5 ఏళ్ళ పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల పై ఆదాయ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే రికరింగ్ డిపాజిట్లు మాత్రం ఆదాయ పన్ను ప్రయోజనాలను అందించవు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు:

వినియోగదారులు పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి కనీసం నెలకు రూ.10 లేదా రూ.5 గుణకాలలో చెల్లించవలసి ఉంటుందని ఇండియా పోస్ట్ తన వెబ్సైట్ indiapost.gov.in లో పేర్కొంది. ఈ మొత్తం మీద గరిష్ట పరిమితి ఏమి లేదు. రికరింగ్ డిపాజిట్ ఖాతాను నగదు లేదా చెక్ ద్వారా చెల్లింపు చేసి తెరవవచ్చు. అలాగే ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్ కు ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఎన్ని రికరింగ్ డిపాజిట్ ఖాతాలనైనా పోస్ట్ ఆఫీస్ లో తెరవవచ్చు. ఒక నామినీని ఎంచుకునే సదుపాయం ఖాతాను ప్రారంభించే సమయంలో అలాగే ఖాతా తెరచిన తరువాత కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు కలిసి ఉమ్మడి రికరింగ్ డిపాజిట్ ఖాతాను కూడా తెరవవచ్చు. అయితే ఇద్దరి వయస్సు 18 సంవత్సరాలు దాటి ఉండాలి.

రికరింగ్ డిపాజిట్ ఖాతాను నెలలో 15వ తేదీ లోగా తెరిస్తే గనుక తదుపరి డిపాజిట్ ను వచ్చే నెల 15వ తేదీ లోగా చెల్లించవలసి ఉంటుంది. అదే రికరింగ్ డిపాజిట్ ఖాతాను నెలలో 16 వ రోజు నుంచి నెలలో చివరి పని దినం మధ్య తెరిచినట్లైతే, వచ్చే నెల చివరి పని దినంలోగా డిపాజిట్ ను చెల్లించాలి. గడువు తేదీలోగా చెల్లింపు చేయకపోతే డిఫాల్ట్ ఫీజుగా ప్రతి రూ. 5 లకు రూ. 0.05 చార్జ్ చెల్లించవలసి ఉంటుంది. అదే వరుసగా నాలుగు సార్లు చెల్లింపులు చేయకపోతే మీ ఖాతా నునిలిపివేస్తారు. నిలిపివేసిన రెండు నెలల్లోగా మీ ఖాతాను పునరుద్ధరించకపోతే తదుపరి మీ ఖాతాలో డిపాజిట్ చేయలేరు.

ఒకవేళ మీరు కనీసం ఆరు వాయిదాలను ముందస్తుగా డిపాజిట్ చేసినట్లయితే రిబేటు లభిస్తుంది. ఒక‌రిగా ప్రారంభించిన ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఒక సంవత్సరం తరవాత ఖాతాలో ఉన్న మొత్తం నుంచి 50 శాతం నగదును ఉపసంహరించుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు:

పోస్ట్ ఆఫీసులు వడ్డీ రేటును 6.9 శాతంగా ( ప్ర‌తి మూడు నెల‌ల‌కు కాంపౌండింగ్) అందిస్తున్నాయి. మెచ్యూరిటీ సమయంలో, రూ.10 ల ఖాతా రూ.717.43 లను పొందుతుంది. రికరింగ్ డిపాజిట్ ఖాతా మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది.

పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ :

ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను కనీసం రూ. 200లతో ప్రారంభించవలసి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో జమ చేసే మొత్తంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి ఖాతాగా ప్రారంభించవచ్చు. అలాగే రికరింగ్ డిపాజిట్ మాదిరిగా వ్యక్తిగతంగా ప్రారంభించిన ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఈ ఖాతా ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరోక పోస్ట్ ఆఫీస్ కి కూడా బదిలీ చేసుకోవచ్చు.

ఐదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో పెట్టుబడి పెట్టినట్లయితే, సెక్షన్ 80సి ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను ప్రయోజనం పొందవచ్చు.

పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు:

PO-INT-RATES.png

గమనిక: వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుత రేట్ల కోసం పోస్ట్ ఆఫీసు వెబ్సైటు చుడండి లేదా వారి బ్రాంచీ ని సంప్రదించండి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly