క్యాన్సర్ ను కవర్ చేసే బీమా పాలసీ అవసరమా?

మొదటగా మీరు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసి, రెండు సంవత్సరాల తర్వాత సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం మంచిది

క్యాన్సర్ ను కవర్ చేసే బీమా పాలసీ అవసరమా?

మీరు దేశంలో క్యాన్సర్ నుంచి మిమల్ని మీరు కవర్ చేసుకోవడానికి మూడు రకాల విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి మీ సాధారణ ఆరోగ్య బీమా ప్లాన్, రెండు నిర్దిష్ట క్యాన్సర్ బీమా ప్లాన్, మూడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ. ఇవి క్యాన్సర్ తో పాటు ఇతర క్రిటికల్ ఇల్నెస్ లను కూడా కవర్ చేస్తాయి. ఆన్ లైన్ బీమా అగ్రిగేటర్ పాలసీ బజార్ వెబ్సైటు లో లభించే పాలసీల ప్రకారం, ముంబయిలో నివసించే 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి, రూ. 10 లక్షల హామీ మొత్తంతో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలనుకుంటే, వార్షిక ప్రీమియం కింద రూ. 9,762 చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట క్యాన్సర్ ప్లాన్ల ప్రీమియం రూ. 2,136 కాగా, క్రిటికల్ ఇల్నెస్ కవర్ ప్రీమియం రూ. 2,880 గా ఉంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఒకేసారి అనేక రకాల అనారోగ్యాలను కవర్ చేస్తుంది. అనారోగ్యం కోసం ఒక ప్రత్యేక నిర్దిష్ట క్యాన్సర్ ప్లాన్ ను తీసుకోవటానికి ఇది మీకు అసౌకర్యంగా మారుతుందని ల్యాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ సదాగోపన్ తెలిపారు. మీరు సంపాదించడం ప్రారంభించినప్పుడు, మొదటగా మీరు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసి, రెండు సంవత్సరాల తర్వాత సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకుని, అనంతరం మీకు 35 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక క్రిటికల్ ఇల్నెస్ కవర్ ను తీసుకోవడం మంచిదని సదాగోపన్ తెలిపారు.

మీరు ఎందుకు దీనిని ఎంచుకోవాలి?

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కింద పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రకారం, ఒక్క 2018 సంవత్సరంలోనే మన దేశంలో 7.8 లక్షల మంది క్యాన్సర్ తో మరణించారు. అందులో 4.13 లక్షల మంది పురుషులు కాగా, 3.71 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఆన్ లైన్ మెడికల్ జర్నల్ Thelancet.com అధ్యయనం ప్రకారం, 2016 సంవత్సరంలో మన దేశంలో సంభవించిన మొత్తం మరణాలలో 28.1 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణించగా, 14.1 శాతం మంది డిసెబిలిటీ ఎడ్జెస్టడ్ లైఫ్ ఇయర్స్ (డీఏఎల్వై) కారణంగా మరణించారు. అదే 1990 సంవత్సరంతో పోలిస్తే, వీటి సంఖ్య 15.2 శాతం, 6.9 శాతంగా ఉంది. అందువలన, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది నిర్దిష్ట క్యాన్సర్ పాలసీ కంటే ఉత్తమం.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly