మ్యూచువ‌ల్ ఫండ్ వ్యాపారంలోకి య‌స్ బ్యాంక్

మ్యూచువ‌ల్ ఫండ్ వ్యాపారంలోకి అడుగుపెట్ట‌నున్న య‌స్ బ్యాంక్

మ్యూచువ‌ల్ ఫండ్ వ్యాపారంలోకి య‌స్ బ్యాంక్

బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తోన్న య‌స్ బ్యాంక్ ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ల వ్యాపారంలోకి ప్ర‌వేశించింది. తాజాగా బ్యాంకింగ్ రెగ్యులేట‌రీ సంస్థ భార‌త‌ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అనుమ‌తి ల‌భించ‌డంతో య‌స్ బ్యాంక్ స్పాన్స‌ర్ గా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ప్రారంభించ‌నుంది.

య‌స్ బ్యాంక్ మ్యూచువ‌ల్ ఫండ్ విభాగానికి య‌స్ అసెట్ మేనేజ్ మెంట్ ఇండియా లిమిటెడ్ (యామిల్) గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. త‌మకు ఉన్న బ్యాంకింగ్ అనుభ‌వం మ్యూచువ‌ల్ ఫండ్ల వ్యాపారంలో కూడా రాణించేందుకు తోడ్ప‌డుతుంద‌ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టెర్,సీఈఓ రాణా క‌పూర్ పేర్కొన్నారు.

యామిల్ కూడా య‌స్ బ్యాంక్ ప్ర‌ధాన కార్యాల‌యం లోవ‌ర్ ప‌రేల్ ముంబ‌య్ కేంద్రంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. మ్యూచువ‌ల్ ఫండ్ల వ్యాపారానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌, నిర్వ‌హ‌ణ ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. య‌స్ బ్యాంకు పూర్తి అనుబంధ సంస్థగా యామిల్ వ్య‌వ‌హ‌రిస్తుంది. వ‌చ్చే 6-12 నెల‌ల్లో ఈక్విటీ, డెట్ వ‌ర్గాల‌కు చెందిన మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను విప‌ణిలోకి తీసుకురానున్న‌ట్లు పేర్కొన్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly