డెబిట్ కార్డు చెల్లింపుల‌తోనూ ప్ర‌యోజ‌నాలు పొంద‌చ్చ‌ని మీకు తెలుసా?

బ్యాంకులు మీ డెబిట్ కార్డు చెల్లింపుల‌పైనా కూడా రివార్డ్ పాయింట్లను అందిస్తున్నాయి

డెబిట్ కార్డు చెల్లింపుల‌తోనూ ప్ర‌యోజ‌నాలు పొంద‌చ్చ‌ని మీకు తెలుసా?

చాలా మంది డెబిట్ కార్డులను చెల్లింపుల కోసం లేదా ఏటీఎమ్‌ల నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌రించుకునేందుకు మాత్ర‌మే ఉప‌యోగిస్తుంటారు. కానీ డెబిట్ కార్డులు ఈ రెండు ఫంక్ష‌న్లు మాత్ర‌మే కాకుండా మ‌రొకొన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయ‌ని మీకు తెలుసా? క్రెడిట్ కార్డుల మాదిరిగానే, డెబిట్ కార్డుల నుంచి కూడా విమానాశ్రయం లాంజ్ యాక్సెస్, ఓచర్లు, వ్య‌క్తిగత ప్రమాద బీమా వంటి రివార్డులను కూడా అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డుతో పోలిస్తే, డెబిట్ కార్డ్ క‌ల్పించ‌లేని ఏకైక స‌దుపాయం నిర్ధిష్ట కాలానికి వ‌డ్డీ లేకుండా రుణ స‌దుపాయం క‌ల్పించ‌డం. అయితే, కొన్ని డెబిట్ కార్డులు ఇప్పుడు, ఎంపిక చేసిన వ్యాపారుల వ‌ద్ద కొనుగోలు చేసిన వ‌స్తువుల‌పై ఈఎమ్ఐ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వ‌హించిన వారి డెబిట్ కార్డుల‌పై కూడా బ్యాంకులు నిర్వ‌హ‌ణ రుసుముల‌ను మాఫీ చేస్తున్నాయి. అయితే క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హించని వారి డెబిట్ కార్డుల‌పై నిర్వహణ రుసుములు వ‌సూలు చేస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కి, భార‌త్‌లో ప్రైవైట్ బ్యాంకుల‌లో అతిపెద్ద‌దైన ఒక బ్యాంకులో, డెబిట్ కార్డును జారీ చేసేందుకు ముందుగా ఖాతాలో రూ.5 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయాలి. త్రైమాసిక స‌గ‌టు బ్యాలెన్స్, మొత్తం రిలేష‌న్‌షిప్ వేల్యూ నిర్వ‌హ‌ణ‌ల‌పై కూడా కొన్ని ష‌ర‌తులు విధిస్తుంది. శాల‌రీ ఖాతాదారుల నెల‌వారీ నిక‌ర శాల‌రీ క్రెడిట్ రూ.3 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ ఉండాలి. పైన తెలిపిన నిబంధ‌న‌లు అన్ని పాటించ‌నందుకు ప్ర‌తిగా, కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి రివార్డు పాయింట్లు, విమానాశ్ర‌య లాంజ్ యాక్సిస్, వ్య‌క్తిగ‌త ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు రూ. 15 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌, ఒక‌వేళ విమాన ప్ర‌మాదం జ‌రిగితే రూ.1 కోటి క‌వ‌రేజ్ అందిస్తుంది. విమాన ప్ర‌మాద క‌వ‌రజ్‌కు సంబంధించి విమాన టికెట్‌ను కార్డును ఉప‌యోగించి బుక్ చేసుకున్న వారికి మాత్ర‌మే వ‌ర్తించేలా నియ‌మ నిబంధ‌న‌లు ఉండ‌చ్చు.

మ‌రొక ప్ర‌ధాన ప్రైవేట్ బ్యాంకు డెబిట్ కార్డు ఎంచుకున్న వారికి, ఎంపిక చేసిన వ్యాపార సంస్థ‌ల వ‌ద్ద కార్డును ఉప‌యోగించి కొనుగోలు జ‌రిపితే కొనుగోలు చేసిన మొత్తంపై 1 శాతం నెల‌కు గ‌రిష్టంగా రూ.750 వ‌ర‌కు క్యాష్‌బ్యాంక్ అందిస్తుంది. కార్డును ఉప‌యోగించిన కొనుగోలు చేసిన నిర్ధిష్ట స‌మ‌యం లోపుల అగ్ని ప్ర‌మాదం లేదా దోపిడి జ‌రిగితే రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఈ బ్యాంకు కార్డు కూడా విమానాశ్ర‌య లాంజ్ యాక్సిస్‌ను అందిస్తుంది.

దాదాపు అన్ని బ్యాంకులు డెబిట్ కార్డుల‌పై కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. పాయింట్-ఆఫ్-సేల్ ( పీఓపీ) వ‌ద్ద కార్డును మిష‌న్‌పై ఉంచ‌డం ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. అయితే కార్డు దుర్వినియోగం అవుతుంద‌నే భ‌యంతో చాలా మంది ఈ ఫీచ‌రును ఉప‌యోగించ‌డం లేదు. ఇటువంటి లావాదేవీల‌కు ఆర్‌బీఐ అనుమ‌తించే గ‌రిష్ట మొత్తం రూ. 2వేలు మాత్ర‌మే.

డెబిట్ కార్డుల రివార్డుల విష‌యంలో వినియోగ‌దారులు రెండు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మొద‌టిది డెబిట్ కార్డుల‌తో పోలిస్తే క్రెడిట్ కార్డు(ఖ‌ర్చు చేసే మొత్తం స‌మానంగా ఉన్న‌ప్ప‌కీ)పై ఎక్కువ రివార్డు పాయింట్లు వ‌స్తాయి. చెల్లింపులు చేసేందుకు ఈ రెండు కార్డుల‌లో ఒక దాని ఎంచుకోవ‌ల్సి వ‌చ్చిన‌ప్పుడు డెబిట్ కార్డులు ఎక్కువ ప్ర‌యోజ‌నాన్ని ఇవ్వ‌వు. రెండోది, క్రెడిట్ కార్డుల ప్ర‌యోజ‌నాల మాదిరిగానే డెబిట్ కార్డుల ప్ర‌యోజ‌నాలకు కూడా కాల‌ప‌రిమితి ఉంటుంది. మీరు ఒక సంవత్సరంలో అనేక డెబిట్ కార్డ్ రివార్డు పాయింట్ల‌ను కూడబెట్టి ఉండచ్చు అయితే గడువు తేది లోపుగా వీటిని ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్ర‌యోజ‌నాన్ని కోల్పోవచ్చు. అందువ‌ల్ల డెబిట్ కార్డుల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తూ స‌మ‌యానికి ఉపయోగించాలి.

చివరగా:
డెబిట్ కార్డు రివార్డు పాయింట్ల‌ ఆధారంగా బ్యాంకును ఎన్నుకోవ‌డం మంచిది కాదు. ఇది మీకు కొన్ని అదనపు ప్రయోజనాలను ఇస్తుంది కాని డిపాజిట్ రేట్లు, టెక్-ఫ్రెండ్లీనెస్, కస్టమర్ సర్వీస్, బ్రాంచ్ నెట్‌వర్క్ వంటి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ల్సి ముఖ్య విష‌యాలు చాలా ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly