మీ క్రెడిట్ స్కోరులో భారీ మార్పు వచ్చిందా? దానికి ఇదే కారణం కావచ్చు..

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, జనవరిలో మొత్తం వినియోగదారులలో 60 శాతం మందికి 775 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంది

మీ క్రెడిట్ స్కోరులో భారీ మార్పు వచ్చిందా? దానికి ఇదే కారణం కావచ్చు..

జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నుంచి వచ్చిన మీ క్రెడిట్ స్కోరును చూసి షాక్ అయ్యారా? అయితే, మీరు ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ) రుణగ్రహీతలు, కార్డుదారులకు స్కోర్ చేసే విధానాన్ని మార్చింది. కొత్త స్కోరింగ్ విధానం కారణంగా, క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి చాలా మంది క్రెడిట్ స్కోర్లు తగ్గాయి.

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, జనవరిలో మొత్తం వినియోగదారులలో 60 శాతం మందికి 775 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంది. కానీ ఇప్పుడు 37 శాతం మంది వినియోగదారులకు మాత్రమే 765 కంటే ఎక్కువ స్కోరు ఉంది. ఇటీవల మేము ఒక కొత్త స్కోరింగ్ విధానాన్ని ప్రారంభించాము. ఇది సూక్ష్మంగా ఉండి, 36 నెలల క్రెడిట్ డేటా ఆధారంగా పనిచేస్తుంది. అంతకుముందు మేము 24 నెలల డేటాను మాత్రమే పరిశీలించామని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఎండీ, సీఈఓ రాజేష్ కుమార్ తెలిపారు. ఇది సిబిల్ క్రెడిట్విజన్ స్కోరు మూడవ వెర్షన్.

అయితే, వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ల తగ్గుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది రుణదాతల తిరస్కరణకు దారితీయదు. సిబిల్ కొత్త స్కోరింగ్ విధానాన్ని అమలు చేసినందున, సీఐసీ తన మెంబర్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్‌బీఎఫ్‌సీ) తమ రుణ విధానాలను తదనుగుణంగా మార్చడానికి పనిచేసింది.

అల్గారిథంలు మారడం వలన పాత, క్రొత్త స్కోర్‌ల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. ఫలితంగా, అదే డేటాతో కూడా మీ క్రెడిట్ స్కోరు పడిపోవచ్చు.

వివిధ కారణాల వలన ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కొత్త స్కోరింగ్ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పుడు సరికొత్త సాంకేతికతతో కొత్త స్కోరింగ్ విధానం ఉండనుంది. అలాగే వినియోగదారుల ఆలోచనా సరళి కూడా మారుతోంది. వ్యక్తిగత, కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు వంటి వినియోగ రుణాల కోసం ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని రాజేష్ కుమార్ తెలిపారు.

24 నెలల డేటాకు బదులుగా 36 నెలల డేటాపై రుణాలు తీసుకోవడం, ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కచ్చితమైన సిబిల్ స్కోరును అందించడానికి అనుమతిస్తుంది. క్రెడిట్ స్కోర్‌ ను అందించడానికి ట్రాన్స్‌యూనియన్ సిబిల్ బహుళ పారామీటర్స్, సంక్లిష్ట అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. క్రెడిట్ స్కోరుపై ఆధారపడిన కొన్ని పారామీటర్స్ లో చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగం, సురక్షితమైన రుణాలు, అసురక్షితమైన రుణాలు, ఎంక్వయిరీలు ఉన్నాయి.

వినియోగదారుల ఎక్కువ కాలం డేటాను పరిశీలించడం ద్వారా వారి క్రెడిట్ హిస్టరీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి సహాయపడుతుంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెబ్‌సైట్ ప్రకారం, దీర్ఘకాలిక బకాయిలు, క్రెడిట్ కార్డులపై లావాదేవీ హిస్టరీ, చెల్లించాల్సిన మొత్తానికి తిరిగి చెల్లించే నిష్పత్తి, తెరిచిన, మూసివేసిన కొత్త ఖాతాల సంఖ్య వంటివి కూడా ఈ కొత్త మెకానిజంలో ఉన్నాయి.

మునుపటి స్కోరింగ్ విధానంలో, స్కోరును పొందటానికి ముందు వినియోగదారులు ఆరు నెలల క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలి. అయితే, కొత్త విధానంలో వినియోగదారులు ఆరు నెలల కంటే తక్కువ క్రెడిట్ హిస్టరీని కలిగి ఉన్నప్పటికీ స్కోర్ ను పొందవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly