జొమాటో ఇన్ఫినిటీ డైనింగ్ ప్లాన్...

దిల్లీ, ముంబ‌యి, బెంగుళూరు న‌గ‌రాల‌లో 350 రెస్టారెంట్ల భాగ‌స్వామ్యంతో జొమాటో ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

జొమాటో ఇన్ఫినిటీ డైనింగ్ ప్లాన్...

ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ జొమాటో త‌మ గోల్డ్ చందాదారుల కోసం ఇన్ఫినిటీ డైనింగ్ ప్లాన్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా భాగ‌స్వామ్య రెస్టారెంట్ల‌తో క‌లిసి అన్‌లిమిటెడ్ ఫుడ్ స‌దుపాయాన్ని క‌ల్పించింది. రెండు పూట‌ల భోజ‌నానికి ఖ‌ర్చు చేసే మొత్తంతో అన్‌లిమిటెడ్ మెను నుంచి ఏదైనా ఆర్డ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది. క‌నీసం 3.5 రేటింగ్ ఉన్న దిల్లీ, ముంబ‌యి, బెంగుళూరు న‌గ‌రాల‌లోని 350 రెస్టారెంట్ల భాగ‌స్వామ్యంతో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ ఆఫర్ హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

రెస్టారెంట్ల అమ్మకాలతో పాటు చందాదారులకు స‌దుపాయాల‌ను పెంచడంలో జోమాటో గోల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రంగంలో అవకాశాలు మ‌రింత విస్త‌రిస్తున్నాయి. ఇన్ఫినిటీ డైనింగ్ దీనికి మ‌రింత లాభాన్ని ఇస్తుందని జొమాటో ఆశిస్తోంది. ఇటువంటి ఆఫ‌ర్‌ను భార‌త్‌లోనే మొద‌టిసారిగా ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపింది.

గత ఎనిమిది నెలల్లో గోల్డ్ చందాదారుల స‌బ్‌స్క్రిప్ష‌న్ దాదాపు 100 శాతం పెరిగింది. ఇప్పుడు భారత్‌, యుఏఈ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లెబనాన్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి తొమ్మిది దేశాలలో క‌లిపి 1.25 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారని జోమాటో చెప్పింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly